: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న జగన్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వైఎస్ జగన్ కు పూర్ణకుంభంతో పూజారులు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నానని జగన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సింహాచలం భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతకుముందు, విశాఖ ఆర్కే బీచ్ లో కోతకు గురైన ప్రాంతాన్ని జగన్ పరిశీలించారు. శారదాపీఠంలోని పలు ఆలయాలను కూడా జగన్ సందర్శించారు. శారదాపీఠం నిర్వహిస్తున్న చతుర్వేద యాగంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News