: లిబియా రాజధాని ట్రిపోలీలో దుండగుల కాల్పులు... ముగ్గురి మృతి


లిబియా రాజధాని ట్రిపోలీలోని కొరింథియా హోటల్ వద్ద దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. హోటల్ లోకి చొరబడిన దుండగులు ముగ్గురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. హోటల్ లో ఉన్న పలువురు విదేశీయులను బందీలుగా పట్టుకున్నారు. ముసుగులు వేసుకుని, బుల్లెట్ ప్రూఫ్ ధరించిన ఐదుగురు దుండగులు హోటల్ కి వచ్చి కాల్పులు జరిపినట్టు హోటల్ నుంచి బయటకు వచ్చిన హసన్ అల్ అబే అనే కార్పొరేట్ సేల్స్ మేనేజర్ తెలిపాడు. అంతకుముందు, గార్డులతో గొడవపడిన దుండగులు, హోటల్ ను ఖాళీ చేయించారని, పార్కింగ్ లో ఉంచిన ఓ కారును బాంబుతో పేల్చారని వివరించాడు. హోటల్ లో యూరోపియన్, టర్కిష్ వ్యక్తులు ఉన్నారని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News