: ప్రత్యేక హోదా రావడం కష్టమే: మురళీమోహన్


రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు ఉభయసభల్లో మాట్లాడిన మాటలు, చేసిన బాసలు అన్నీ ఉత్తుత్తివేనా? రోజులు గడుస్తున్న కొద్దీ నిజమే అనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా తీర్మానం చేసినా... అది కార్యరూపం దాల్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు. టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని తేల్చి చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఇదే విషయం చెబుతున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని... అందువల్ల పరోక్షంగా ఏదైనా సహాయం చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఏపీకి ప్రత్యేకహోదా కష్టమే అని అనిపించకమానదు.

  • Loading...

More Telugu News