: ప్రభుత్వ లాంఛనాలతో ఆర్.కె.లక్ష్మణ్ అంత్యక్రియలు
లెజండరీ కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్ గౌరవార్థం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు పూణెలోని వైకుంఠలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానున్నారని చెప్పారు. 94 ఏళ్ల లక్ష్మణ్ పూణెలోని ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు తదితరులు సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో సంతాపం వ్యక్తం చేశారు.