: రాజాం వెళ్లిన పవన్ కల్యాణ్
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా రాజాం వెళ్లారు. ఈ ఉదయం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి వరలక్ష్మి జీఎంఆర్ కేర్ ఆసుపత్రిని సందర్శించారు. కాగా, పవన్ కల్యాణ్ రాకతో రాజాంలో సందడి నెలకొంది. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.