: నటుడు కోట శ్రీనివాసరావుకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ సన్మానం


కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా నటుడు కోట శ్రీనివాసరావును హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు సన్మానించారు. ప్రస్తుతం కోట... అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కోటకు చిత్ర యూనిట్ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేత కేక్ కట్ చేయించారు. పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రంలో నటిస్తున్న నటుడు రాజేంద్రప్రసాద్, హీరో ఉపేంద్ర, హీరోయిన్ స్నేహ కూడా కోటకు సన్మానం సమయంలో సెట్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News