: రాజ్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం... హాజరైన చంద్రబాబు, కేసీఆర్
హైదరాబాదులోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన 'ఎట్ హోం' కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ ఆహ్వానం మేరకు వారిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు పలువురు మంత్రులు, నేతలు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను 'ఎట్ హోం'కు ఆహ్వానించి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకునే విధంగా చేస్తానని గవర్నర్ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ఇద్దరు సీఎంలు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఇది రెండవసారి. కాగా, ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గవర్నర్ ఆత్మీయంగా పలకరించారు. వారితో కాసేపు ముచ్చటించారు.