: ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్లో సానియా జోడీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా మీర్జా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడోరౌండ్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన పోరులో ఇండో-బ్రెజిల్ ద్వయం 7-5, 6-7, 10-8తో అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)- శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంటపై చెమటోడ్చి నెగ్గింది. గంటన్నరపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో సానియా జోడీ కీలక పాయింట్ల వద్ద పొరపాట్లకు తావివ్వకుండా మ్యాచ్ ను చేజిక్కించుంది. సానియా, సోరెస్ తమ తదుపరి మ్యాచ్ లో ఆండ్రెజా క్లెపాక్-క్రిస్ గుసియోన్, కాసే డెల్లాక్వా-జాన్ పీర్స్ జోడీల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడతారు.