: 'డేర్ డెవిల్స్' బృందం విన్యాసాలకు బొటనవేలు పైకెత్తిన ఒబామా
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, మోటార్ సైకిళ్లపై వారు చేసిన ఫీట్లు విశిష్ట అతిథి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అబ్బురపరిచాయి. వారి విన్యాసాలకు ప్రశంసాపూర్వకంగా బొటనవేలు పైకెత్తారు. ఆయన అర్ధాంగి మిషెల్ కూడా బైకర్ల ప్రదర్శనకు ముగ్ధులయ్యారు. అంతేగాకుండా, భారత వాయుసేన విన్యాసాలను కూడా ఒబామా దంపతులు కన్నార్పకుండా వీక్షించడం విశేషం. బీఎస్ఎఫ్ కు చెందిన డేర్ డేవిల్స్ బృందం ఎప్పట్లానే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, అహూతులను అలరించింది.