: పార్టీ నేతలు నన్ను పట్టించుకోవడం లేదు: లోకేష్ కు ఎమ్మెల్యే మాధవరం ఫిర్యాదు


పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ తెలంగాణ టీడీపీ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ యువనేత నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. టి.టీడీపీ నేతలు కనీసం తనను పట్టించుకోవడం లేదని ఈరోజు లోకేష్ ను కలసిన మాధవరం వాపోయారు. టీఆర్ఎస్ లో చేరతానని తానెప్పుడూ అనలేదని చెప్పారు. కాగా, కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో అధినేత చంద్రబాబు ఫొటో పెట్టలేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News