: తెలంగాణ ఘనంగా గణతంత్ర వేడుకలు... శకటాల ప్రదర్శన రద్దు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని వచ్చిన గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ పాల్గొన్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ను మళ్ళించారు. సమయభావం వల్ల శకటాల ప్రదర్శనను రద్దు చేశారు.