: మరోసారి నిరాశ పరచిన ధావన్... 44 ఓవర్లకు మ్యాచ్ కుదింపు


ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఏడో ఓవర్లో ధావన్ (8) అనవసర షాట్ కు యత్నించి పెవిలియన్ కు చేరాడు. మొత్తం 13 బంతులను ఎదుర్కొన్న ధావన్... స్టార్క్ బౌలింగ్లో ఫించ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం 13వ ఓవర్ ఆఖరి బంతికి అంబటి రాయుడు మార్ష్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 24 బంతులాడిన రాయుడు 23 పరుగులు చేసి 62 పరుగుల స్కోర్ వద్ద రెండవ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. కాగా, మ్యాచ్ ను 44 ఓవర్లకు కుదించారు.

  • Loading...

More Telugu News