: గాంధీభవన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
నాంపల్లిలోని గాంధీ భవన్ లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత రాజకీయాలను అడ్డు పెట్టుకొని బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మహిళా నేతలతో పాటు కార్యకర్తలు, గాంధీ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ భవన్ సిబ్బంది తెల్ల దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు.