: వైభవంగా ప్రారంభమైన నవ్యాంధ్ర గణతంత్ర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత నగరం విజయవాడలో తొలి గణతంత్ర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉదయం 7:45 గంటలకు ప్రారంభమైన వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గౌరవ వందనం తరువాత గవర్నర్ స్టేడియంలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.