: 104 'పద్మ' పురస్కారాలు...సింధు, కోటకి కూడా


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మ' పురస్కారాలు ప్రకటించింది. తొమ్మిది మందికి 'పద్మవిభూషణ్' పురస్కారాలు ప్రకటించింది. 20 మందికి 'పద్మభూషణ్' పుస్కారాలు ప్రకటించింది. 75 మందికి 'పద్మశ్రీ' పురస్కారాలు ప్రకటించింది. 'పద్మవిభూషణ్' పురస్కారాలు పొందిన వారిలో అద్వానీ, అమితాబ్ బచ్చన్, ప్రకాశ్ సింగ్ బాదల్, దిలీప్ కుమార్, ప్రొఫెసర్ రామస్వామి శ్రీనివాసన్, వీరేంద్ర హెగ్డే, రామానందచార్య, కె.వేణుగోపాల్, కరీం అల్ హుస్సేనీ చోటు సంపాదించగా, బిల్ గేట్స్ దంపతులకు 'పద్మభూషణ్' పురస్కారాలు పొందారు. 'పద్మశ్రీ' పురస్కారం లభించిన వారిలో తెలుగుతేజం పీవీ సింధు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News