: ఒబామాకు మోదీ, ప్రణబ్ ఇస్తున్న విందు మెనూ ఇదే


భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ హస్ లో ఈ మధ్యాహ్నం ఒబామా, మోదీ కలసి భోజనం చేశారు. శాకాహారి అయిన మోదీ అమెరికా అధ్యక్షుడి కోసం వెజ్, నాన్ వెజ్ మెనూతో కూడిన భారతీయ వంటకాలు ఏర్పాటు చేశారు. కాశ్మీర్ వంటకం నడ్రు కె గూలర్, బెంగాల్ వంట మహి సర్సాన్, షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్డ్ వెజిటబుల్ కలోంజి, కెలా మేథీ ను షాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామూన్, పండ్లను సిద్ధంగా ఉంచారు. ఒబామా ఏయే పదార్థాలను రుచి చూశారో తెలియనప్పటికీ, విందును ఆస్వాదించినట్టు సమాచారం. తరువాత జరిగిన వాక్ అండ్ టాక్ లో దక్షిణ భారతంలో తాగే కాఫీ, హెర్బల్ టీని అందజేశారు. కాగా, నేటి రాత్రి ఒబామాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా ను మెనూలో చేర్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News