: టీచర్ పై దాడి చేసిన హోంగార్డు ఆత్మహత్య
విశాఖపట్టణం ఏజెన్సీలోని చింతపల్లి మండలం దోమలగొందిలో ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి చేసిన హోంగార్డు మానిక రాజేష్ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేష్ పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వరసకు అత్త అయ్యే కొర్ర రత్నకుమారి అనే టీచర్ వెంటపడేవాడు. అతడి ప్రపోజల్ ను తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన రాజేష్, కత్తితో ఆమెను గాయపరిచి, అడవిలోకి పరారయ్యాడు. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు మమ్మరం చేశారు. దీంతో పట్టుబడతాననే భయంతో అడవిలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం అడవికి వెళ్లిన మహిళలకు అతను ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.