: పొంగిన సముద్రం... నీట మునిగిన విశాఖ ఉత్సవాల వేదిక!
విశాఖపట్నంలో ఈ ఉదయం సముద్రం ముందుకు వచ్చింది. ఒక్కసారిగా కెరటాల ఉద్ధృతి పెరగడంతో, ఆర్కే బీచ్ లో నిర్మించిన విశాఖ ఉత్సవాల వేదిక నీట మునిగింది. వేదిక ప్రధాన ప్రాంగణం నిండా నీరు చేరింది. నీటిని మోటార్లతో తోడివేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.