: పారిశ్రామిక వేత్తలూ, ఏపీకి పోదాం రండి: ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్


హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామికవేత్తలంతా ఏపీకి రావాలని పలువురు పారిశ్రామికవేత్తలు పిలుపునిచ్చారు. ఫ్యాప్సీలో భాగంగా ఉన్న ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ రెండుగా విడిపోయింది. అది కొత్తగా ఏపీ శాఖగా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా వారు నిర్వహించిన సమావేశంలో హైదరాబాదులో ఉన్న పారిశ్రామిక వేత్తలలంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు. అలాగే పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాప్సీలో ఉన్న అసోసియేషన్ కు బదులుగా ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ గా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఫ్యాప్సీ పారిశ్రామికవేత్తలకు వేదికగా ఉండేది. విభజన అనంతరం కూడా అలాగే ఉంచాలని భావించినప్పటికీ, అన్ని రంగాల్లో ఉన్న విద్వేషాలు తమ సంస్థలో కూడా రాకూడదని భావించిన ఏపీ పారిశ్రామిక వేత్తలు ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ ను ఏర్పాటు చేశారు. దీనిని కూడా మూడు జోన్లుగా ఉత్తరాంధ్ర, సెంట్రల్, రాయలసీమ గా ఏర్పాటు చేశారు. వాటికి ఉపాధ్యక్షులను నియమించారు.

  • Loading...

More Telugu News