: కార్గిల్ లో రికార్డు బద్దలైంది...ప్రమాదం పొంచి ఉంది!


జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ పేరు వినని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేది కూడా ఇక్కడే. ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలుగా మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఇక్కడ రికార్డు స్థాయి కనిష్ఠ అత్యల్ప ఉష్ణోగ్రత. మైనస్ 11 డిగ్రీల నుంచి గత రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయి అల్పానికి పడిపోయాయి. ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఒకేసారి పడిపోవడంతో మైనస్ 17 డిగ్రీలకు పడిపోయింది. ఇది తాజా రికార్డు. కాగా, మంచు కురవడం ప్రారంభం కాగానే జన సంచారం తగ్గుతుంది. దీనిని అనుకూలంగా చేసుకుని పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తారు. మంచు కురవడం ఎక్కువైన కొద్దీ వీరి ప్రయత్నాలు మరింత ఊపందుకుంటాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News