: నెల్లూరు వైసీపీ నేత హత్య కేసులో బీజేపీ మాజీ కార్పోరేటర్ అరెస్టు
నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అల్లం నరేంద్ర హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వారిలో బీజేపీ మాజీ కార్పోరేటర్ శ్రీనివాస్ కూడా ఉండటం గమనార్హం. వారు ముగ్గురిని ప్రస్తుతం విచారిస్తున్నామని, అనంతరం వివరాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు. నెల్లూరుకు చెందిన వైసీపీ నేత, న్యాయవాది నరేంద్ర గతేడాది డిసెంబర్ 30 రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రోడ్డు దాటుతుండగా వెనుకగా వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆయనను కత్తులతో పొడిచారు. ఆసుప్రతికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు.