: కార్యరంగంలోకి దూకిన నారా లోకేశ్... టీడీపీ మేధోమథన సదస్సుకు నేతృత్వం!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి చీఫ్ నారా లోకేశ్ నేడు ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగారు. నిన్నటిదాకా తెరవెనుక ఉంటూనే కార్యక్రమాలను చక్కబెట్టిన ఆయన తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రాంభమైన పార్టీ మేధోమథన సదస్సుకు నేతృత్వం వహిస్తున్నారు. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రస్తుతం ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువతతో పాటు పార్టీ సీనియర్లు, ఏపీ కేబినెట్ లోని పలువురు కీలక మంత్రులు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై పార్టీ నేతలతో లోకేశ్ చర్చిస్తున్నట్లు సమాచారం. నిన్న తన 32వ జన్మదిన్నాన్ని కార్యకర్తల మధ్య అట్టహాసంగా జరుపుకున్న లోకేశ్, మరునాడే ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక భూమిక పోషించే దిశగా కీలక అడుగు వేయడం గమనార్హం.