: హైదరాబాద్, గోవాకు విస్తరిస్తున్న 'విస్తారా' విమానాలు
టాటా గ్రూపు తన 'విస్తారా' విమాన సర్వీసుల సేవలను హైదరాబాద్, గోవాలకు విస్తరించనుంది. విమాన సర్వీసులకు ఆదరణ పెరుగుతుండడంతో 'విస్తారా' విమానాల సంఖ్యను పెంచుతోంది. ఫిబ్రవరి 20 నుంచి గోవా, మార్చి 1 నుంచి హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి తమ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని విస్తారా తెలిపింది. తొలి విడతగా వారానికి 68 విమాన సర్వీసులు ఆరంభించిన విస్తారా మార్చి నాటికి వారానికి 164 విమాన సర్వీసులు నడపనుంది. మరిన్ని విమానాలు అందుబాటులోకి రానుండడంతో విమానయాన రంగంలో తమదైన ముద్రవేస్తామని విస్తారా తెలిపింది.