: రాత్రి 11:30 నుంచి 4:30 వరకు సైట్ పని చేయదు: సౌత్ సెంట్రల్ రైల్వే
నేటి రాత్రి 11:30 నుంచి 4:30 గంటల మధ్య సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన వెబ్ సైట్ పని చేయదని ఆ సంస్థ తెలిపింది. సాంకేతిక కారణాల నేపథ్యంలో రైల్వే వెబ్ సైట్ పని చేయదని, వినియోగదారులు తెలుసుకోవాలని డీపీఆర్వో సూచించారు. తెల్లవారు జాము 4:30 గంటల నుంచి సైట్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.