: పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను తుడిచిపెట్టాల్సిందే: ఒబామా


పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. భారత పర్యటనకు బయల్దేరే ముందు 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల నిందితులకు శిక్ష పడి తీరాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నంత మాత్రాన పాక్ లో ఉగ్రవాద స్థావరాలను అమెరికా ఉపేక్షిస్తుందని భావించకూడదని ఆయన తెలిపారు. పరస్పర విశ్వాసం ప్రాతిపదికన భారత్, అమెరికా సంబంధాలు ఉన్నాయని చెప్పిన ఆయన, భవిష్యత్ లో వీటిని మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News