: సోషల్ మీడియా ద్వారా తల్లీ, పిల్లాడిని కలిపిన పోలీసులు


సోషల్ మీడియాను పోలీసులు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. సాంకేతిక విప్లవాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పోలీసులు తప్పిపోయిన పిల్లాడిని, తన తల్లితో కలపగలిగారు. జార్ఖండ్ కు చెందిన రూపేష్ (14) తన తల్లి కిరణ్ బోడితో కలిసి బంజారాహిల్స్ లోని జగన్నాథస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ తప్పిపోయిన రూపేష్, రాత్రి 9:30 టైంలో కేబీఆర్ పార్క్ వద్ద తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో బాలుడి తల్లి తన కుమారుడు తప్పిపోయాడంటూ తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేబీఆర్ పార్క్ వద్ద బాలుడ్ని గుర్తించిన పోలీసులు, బాలుడి ఫొటోలను వాట్స్ యాప్ ద్వారా హైదరాబాదులోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. దీంతో తిరుమలగిరి పోలీసులు బాలుడ్ని రప్పించి అతడి తల్లికి అప్పగించారు.

  • Loading...

More Telugu News