: ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని ధైర్యంగా నడుపుతా: కేజ్రీవాల్
గతేడాది ఢిల్లీ ప్రజలిచ్చిన అధికారాన్ని నెలన్నర కూడా మోయలేని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఈసారి మాత్రం ఐదేళ్ల పాటు నిబ్బరంగా, నిర్భయంగా, ధైర్యంగా పాలన కొనసాగిస్తారట. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘హ్యాంగవుట్’ భేటీ సందర్భంగా కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేజ్రీవాల్, ట్విట్టర్ లో కిరణ్ బేడీ తనను ఎందుకు బ్లాక్ చేశారో తెలియదని చెప్పారు. ఢిల్లీలో పన్నుల విధానాన్ని సరళీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.