: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 'ఫెడెక్స్'కు బ్రేక్ వేసిన సెప్పి
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరో సంచలనం నమోదైంది. మూడో రౌండ్ లో మాజీ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఓటమిపాలయ్యాడు. ఇటలీ ఆటగాడు ఆండ్రియాస్ సెప్పి 6-4, 7-6 (7-5), 4-6, 7-6 (7-5)తో 'ఫెడెక్స్' కు బ్రేక్ వేశాడు. ప్రపంచ ర్యాంకుల్లో 46వ స్థానంలో ఉన్న సెప్పి ఈ మ్యాచ్ లో అసాధారణ స్థాయి ఆటతీరు కనబరిచాడు. ఫెదరర్ తప్పిదాలు కూడా అతడికి కలిసొచ్చాయి. కెరీర్ లో కేవలం 3 ఏటీపీ టైటిళ్లే గెలిచిన ఈ ఇటాలియన్ 11 ప్రయత్నాల్లో ఫెదరర్ పై నెగ్గడం ఇదే ప్రథమం. ఫెదరర్ ను అభిమానులు ముద్దగా 'ఫెడెక్స్' అని పిలుచుకుంటారు.