: మలేరియానే కదా తగ్గిపోతుందిలే అనుకున్నాం: ఎమ్మెస్ కుమార్తె శశి
ఎమ్మెస్ నారాయణ హఠాన్మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి మరణంతో ఆయన కుమార్తె శశి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆసుపత్రిలో చేరిన వ్యక్తి కోలుకుని తిరిగి వస్తారని భావించామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని విలపించారు. మలేరియానే కదా తగ్గిపోతుందనుకుంటే, ఇలా మనిషినే కబళిస్తుందనుకోలేదని భోరుమన్నారు. ఎమ్మెస్ ఈ నెల 19న భీమవరంలో అస్వస్థతకు గురయ్యారు. దాంతో, ఆయనను విజయవాడ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.