: రూ.6 వేల కోట్ల జనం సొమ్ముతో 1,700 ఎకరాల కొనుగోలు: అగ్రిగోల్డ్ నయా మోసం
స్వల్ప కాలంలో అధిక రాబడులంటూ జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థపై నిన్న మొదలైన ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాదులోని ఆ సంస్థ కార్యాలయాలపై ఐటీ అధికారులు నేడు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సంస్థ కార్యాలయాల్లోని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రజల నుంచి అగ్రిగోల్డ్ రూ.6 వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించిందని తేల్చారు. ఆ డబ్బుతో అగ్రిగోల్డ్ యాజమాన్యం 1,700 ఎకరాల భూములను కొనుగోలు చేసిందని తాజాగా ఐటీ శాఖ సోదాల్లో వెల్లడైంది. జనం డబ్బుతో కొనుగోలు చేసిన సదరు భూములు ఎక్కడెక్కడున్నాయన్న విషయంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. పూర్తి వివరాలు లభించే దాకా సోదాలను కొనసాగించనున్నట్లు ఐటీ శాఖ చెబుతోంది.