: ఔషధ రంగంపై మథనం షురూ... నేటి నుంచి హైదరాబాదులో ఫార్మాపై అంతర్జాతీయ సదస్సు!


ఫార్మా రాజధానిగా విలసిల్లుతున్న హైదరాబాదులో నేడు అంతర్జాతీయ స్థాయి ఫార్మా సదస్సు మొదలు కానుంది. దాదాపు 40 దేశాలకు చెందిన ఆరు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఔషధ రంగం తీరుతెన్నులు, భవిష్యత్ అవకాశాలు తదితరాలపై సుదీర్ఘ చర్చ కొనసాగనుంది. ఇప్పటికే ఫార్మా రంగానికి కేంద్రంగా భాసిల్లుతున్న హైదరాబాదుకు మరిన్ని ఫార్మా కంపెనీలను రాబట్టాలన్న కృత నిశ్చయంతో తెలంగాణ సర్కారు రంగంలోకి దిగుతోంది. సదస్సు సందర్భంగా ఇక్కడికొస్తున్న వారిలో 30 కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ నేరుగా సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News