: చెస్ట్ ఆసుపత్రిలో కేసీఆర్... కూకట్ పల్లిలో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ రక్కసి అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా హైదరాబాదులోని కూకట్ పల్లిలో 8 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుషాయిగూడలో ఇద్దరు చిన్నారులకు స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు, ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ఓ మహిళ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ క్రమంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిని సందర్శించారు. ఆయన వెంట కేంద్ర బృందం కూడా ఉంది. స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులకు అందుతున్న వైద్యం వివరాలను వారు తెలుసుకుంటున్నారు.