: మెదక్ జిల్లాలో దారుణం... యువతిపై అఘాయిత్యం, ఆపై యాసిడ్ దాడి
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గజ్వేల్ మండల పరిధిలోని ఓ యువతిని దుండగులు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. రెండు రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులు, అనంతరం ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఆమెను ఇంటి వద్ద పడేసిన దుండగులు పరారయ్యారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సివుంది.