: ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో చెమటోడ్చిన నడాల్


మాజీ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నడాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండో రౌండ్ ను అతికష్టమ్మీద అధిగమించాడు. అమెరికన్ క్వాలిఫయర్ టిమ్ స్మైస్చెక్ తో జరిగిన పోరులో నడాల్ 6-2, 3-6, 6-7 (2), 6-3, 7-5తో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్ మధ్యలో నడాల్ కడుపు నొప్పితో బాధపడ్డాడు. వైద్య సాయం తీసుకున్న అనంతరం మ్యాచ్ కొనసాగించాడు. ఈ పోరు నాలుగు గంటల పాటు సాగడం విశేషం. పెద్దగా అనుభవం లేకున్నా స్మైస్చెక్... నడాల్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే, కీలక పాయింట్ల వద్ద పొరబాట్లు చేయడంతో సంచలనం నమోదు చేసే అవకాశం తప్పిపోయింది.

  • Loading...

More Telugu News