: మాజీ భార్యకు షేక్ హ్యండ్ ఇచ్చిన కమల్ హాసన్!
నటుడు, దర్శకుడు కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక చాలా రోజుల తరువాత ఎదురుపడ్డారు. వెంటనే చిరునవ్వుతో సారికకు షేక్ హ్యాండ్ ఇచ్చి, చిరునవ్వుతో పలకరించాడు. అటు సారిక కూడా నవ్వుతూ పలకరించింది. ఈ సమయంలో నటి, వారి పెద్ద కుమార్తె శృతి హసన్ కూడా ఉండటం విశేషం. ఈ సంఘటన ముంబయిలో జరిగిన 'షమితాబ్' చిత్రం ఆడియో విడుదల సందర్భంగా చోటు చేసుకుంది. ఈ సినిమాతో కమల్, సారికల చిన్న కుమార్తె అక్షర నటిగా పరిచయమవుతోంది. కమల్, సారిక చాలాకాలం తరువాత కలసిన సందర్భంగా క్లిక్ మన్న ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.