: తాజా వరల్డ్ కప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేరంటున్న ఐసీసీ


ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఎంతో కష్టమని ఐసీసీ పేర్కొంటోంది. టోర్నీలో ఏ ఒక్క పోటీని కూడా ఫిక్స్ చేయలేరని, ఆ మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు. ఆటగాళ్ల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచుతామని చెప్పారు. ఆటలో అవినీతిని అరికట్టేందుకు మునుపెన్నడూ లేనంతగా సంసిద్ధులమై ఉన్నామని ఉద్ఘాటించారు. ఐసీసీ యాంటీ కరప్షన్ బృందాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పోలీసులు, స్థానిక అధికారులతో కలిసి ఈ విషయమై ఎంతో శ్రమించాయని రిచర్డ్సన్ తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడే 100 మందికి పైగా వ్యక్తుల పేర్లతో ఓ జాబితాను స్థానిక భద్రతా సంస్థలకు ఇస్తున్నామని చెప్పారు. తమ కఠిన చర్యల నేపథ్యంలో ఎవరైనా బయటి వ్యక్తులు ఆటగాళ్లను, అంపైర్లను, మరెవరినైనా గానీ ప్రలోభపెట్టి మ్యాచ్ లను ఫిక్స్ చేయడం చాలా కష్టమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News