: ఎంత పెద్ద యుద్ధానికైనా సిద్ధం, ఒక్క ఉగ్రవాదినీ వదలం: ఒబామా


హింసకు పాల్పడే ఏ ఒక్క ఉగ్రవాదినీ వదిలిపెట్టబోమని, ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఎంత పెద్ద యుద్ధాన్ని అయినా చేసేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఆరేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్లో ప్రారంభమైన తాలిబాన్ ఉగ్రవాదుల ఏరివేత ముగిసిందని, తొలుత ఆ దేశానికి 1.8 లక్షల మంది సైన్యం వెళ్ళగా, ఇప్పుడక్కడ కేవలం 15 వేల మంది మాత్రమే వున్నారని, మిగిలిన వారంతా వెనక్కు వచ్చేశారని ఆయన అన్నారు. అమాయకులను బలి తీసుకుంటున్న ఐఎస్ఐఎస్ దురాగతాలను ఎదుర్కొనేందుకు అమెరికా ప్రజా ప్రతినిధులు ఏకతాటిపై నిలవాలని ఆయన కోరారు. ఇందుకోసం సెనేట్ చేసే తీర్మానానికి విపక్షాలు సహకరించాలని ఒబామా కోరారు.

  • Loading...

More Telugu News