: ఢిల్లీలో కూలిన ఏడంతస్తుల భవనం... శిథిలాల కింద పలువురు?


దేశ రాజధాని ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. నగరంలోని గౌతంపురి ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేటి తెల్లవారుజామున భవనం ఉన్నట్లుండి కూలిపోయింది. ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి తరలివెళ్లారు. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 10 ఫైరింజన్ల సహాయంతో ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News