: దీదీకి మరో షాక్... బీజేపీలో చేరేందుకు ఎంపీ దినేశ్ త్రివేదీ యత్నాలు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకీ మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ఆమె కేబినెట్ లోని ఓ మంత్రి పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేదీ కూడా బీజేపీ వైపు చూస్తున్నారట. 2012 రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మరుక్షణమే అధినేత్రి ఆదేశాలతో రాజీనామా చేసిన త్రివేదీ, పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ లో బీజేపీ క్రమంగా బలపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న దీదీ, త్రివేదీ కూడా ఆ పార్టీలో చేరితే ఆమెకు భారీ షాక్ తగలడం ఖాయమే!

  • Loading...

More Telugu News