: దయచేసి 'అన్ బ్లాక్' చేయి... కేజ్రీ కోరిక - సమస్యే లేదు... కిరణ్ బేడి సమాధానం
"కిరణ్ జీ, నేను మీ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతుంటాను. ఇప్పుడు మీరేమో నన్ను 'బ్లాక్' చేశారు. దయచేసి 'అన్ బ్లాక్' చేయండి" అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రేవాల్ తన మాజీ మిత్రురాలు, ప్రస్తుత బీజేపీ నేత కిరణ్ బేడికి విజ్ఞప్తి చేస్తున్నారు. కిరణ్ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను అరవింద్ ఫాలో అవుతుంటారు. ఇటీవలి కాలంలో ఆయన కిరణ్ కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తుండటంతో ఆమె కేజ్రీవాల్ ను 'బ్లాక్' చేసింది. ఇప్పుడిక ఆయన 'అన్ బ్లాక్' చేయమని కోరుతున్నా ససేమిరా అంటున్నారట. కేజ్రీవాల్ తనన ఫాలో కావడం ఇష్టం లేదని, దానివల్ల కొత్త సమస్యలు, ఆరోపణలు వస్తాయని ఆమె అంటున్నారు.