: గుంటూరు-విశాఖ మధ్య ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు-విశాఖల మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఈ రైలు నడుపుతామని తెలిపింది. నేటి నుంచి రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు చెప్పారు. అటు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు వివరించారు. నడికుడి-బీబీనగర్ వంతెన నిర్మాణంలో భాగంగా ఈ మార్పులు చేశామన్నారు. చేసిన మార్పులు: -శబరి ఎక్స్ ప్రెస్ కాజీపేట- న్యూ గుంటూరు మీదగా మళ్లింపు - జన్మభూమి ఎక్స్ ప్రెస్ విజయవాడ-కాజీపేట వైపు మళ్లింపు - సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజరు రైలు నల్లగొండ వరకు - రేపల్లె-సికింద్రాబాద్ రైలు మిర్యాలగూడ వరకు పరిమితం