: ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా


బ్రిస్బేన్ వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 18.6 ఓవర్లలో 67 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు (53 బంతులు, 2 ఫోర్లు) చేసిన అంబటి రాయుడు ఫిన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ ధోనీ (3)కి జతగా స్టువర్ట్ బిన్నీ (2) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు.

  • Loading...

More Telugu News