: ఇక ట్విట్టర్ ద్వారానూ నగదు బదిలీ... ఐసీఐసీఐ వినూత్న సేవలకు శ్రీకారం!
నగదు బదిలీ కోసం ప్రస్తుతానికైతే, బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ల ద్వారా బ్యాంకు శాఖల బయట నుంచే పని పూర్తి చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. తాజాగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మరో అడుగు ముందుకేసింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా కూడా నగదు బదిలీ చేసుకునే వెసులుబాటును తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ, మొబైల్ ఫోన్ రీచార్జీ చేసుకోవడంతో పాటు తమ ఖాతాల్లోని బ్యాలెన్స్ ను కూడా సరిచూసుకోవచ్చు. ఈ మేరకు బ్యాంకు కొత్త సేవలను సోమవారం ప్రారంభించింది.