: ఐటీని ఏపీకి తీసుకొచ్చింది చంద్రబాబే... ఎన్టీఆర్ భార్యను గౌరవించడం నేర్చుకోండి: లక్ష్మీపార్వతి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎల్లప్పుడూ విమర్శనాస్త్రాలు సంధించే వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి... ఈ రోజు ఆయనకు అనుకూలంగా ఓ కామెంట్ చేశారు. ఆశ్చర్యకరమైనా ఇది నిజం. ఓ టెలివిజన్ ఛానల్ డిస్కషన్ లో పాల్గొన్న ఆమె... ఏపీకి ఐటీని తీసుకొచ్చింది చంద్రబాబే అని ఒప్పుకున్నారు. దేశంలోకి ఐటీని తీసుకొచ్చింది మాత్రం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అని చెప్పారు. అయితే, ఐటీని విస్తరించే క్రమంలో చంద్రబాబు విఫలం అయ్యారని వెంటనే సెటైర్ కూడా వేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలను గుప్పించిన చంద్రబాబు, దేన్నీ నెరవేర్చడం లేదని ఆరోపించారు. మరోవైపు, డిస్కషన్ లో పాల్గొన్న ఓ టీడీపీ నేత ఇన్ డైరెక్టుగా లక్ష్మీపార్వతిపై విమర్శలు గుప్పించేందుకు యత్నించగా... ఎన్టీఆర్ భార్యనైన తనను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News