: మా మధ్య గొడవ నిజమే... అయితే సునందను కొట్టలేదు: పోలీసుల విచారణలో శశి థరూర్!


సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ను ఢిల్లీ పోలీసులు నిన్న రాత్రి ప్రశ్నించారు. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని థరూర్ ముందుపెట్టిన పోలీసులు వాటికి సంబంధించిన పూర్తి స్థాయి సమాధానాలను రాబట్టలేకపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసుల ప్రశ్నలకు ఆయన నుంచి కొన్ని సార్లు మౌనం, మరికొన్ని సార్లు చిరునవ్వులే సమాధానంగా వచ్చాయని వినికిడి. వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ లో రాత్రి 8 గంటలకు ప్రారంభమైన విచారణ సుదీర్ఘంగా సాగింది. ‘‘సునంద శరీరంపై 15 చోట్ల గాయాలున్నాయి. గొడవపడిన సందర్భంగా మీరు ఆమెను కొట్టారా?’’ అంటూ సిట్ చీఫ్ కుష్వాహా సంధించిన తొలి ప్రశ్నకు నేరుగానే సమాధానమిచ్చిన థరూర్, తామిద్దరి మధ్య గొడవ నిజమేనని, అయితే తాను అమెను కొట్టలేదని చెప్పుకొచ్చారట. ఆ తర్వాత మిగిలిన అన్ని ప్రశ్నలకు ఆయన నుంచి మౌనం, చిరునవ్వులే సమాధానాలయ్యాయట. పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్ తో ఆయనకు గల సంబంధాలపైనా పోలీసులు ప్రశ్నలు సంధించారని వినికిడి.

  • Loading...

More Telugu News