: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 21 నుంచి తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తామని ఐబీఏ (ఇండియన్ బాంక్స్ అసోసియేషన్) హామీ ఇవ్వడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఐబీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఐబీఏ తెలిపింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేత రాంబాబు స్పందించారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే నాలుగు రోజుల సమ్మెకు నోటీసు ఇస్తామని ఆయన హెచ్చరించారు.