: మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్న మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నెలలో ఆయన జర్మనీ వెళ్లనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. మోదీ పర్యటన అనంతరం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ ఏడాదిలోనే భారత్ పర్యటనకు వస్తారు. కాగా, మోదీ తన జర్మనీ పర్యటనలో భాగంగా సుప్రసిద్ధ హానోవర్ ట్రేడ్ ఫెయిర్ ను ప్రారంభిస్తారు. ఈ ఏడాది హానోవర్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహణలో భారత్ కూ భాగస్వామ్యం ఉంది. వచ్చే ఏడాది ఈ వాణిజ్య ప్రదర్శనలో జర్మనీకి అమెరికా భాగస్వామిగా వ్యవహరిస్తుంది. జర్మనీ-భారత్ సంబంధాలపై భారత్ లో జర్మనీ రాయబారి మైకేల్ స్టీనర్ మాట్లాడుతూ... ఇరుదేశాల సంబంధాల రీత్యా 2015 ఎంతో ముఖ్యమైనదని, 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారానికి తగిన ప్రోత్సాహం అందిపుచ్చుకోవచ్చని అన్నారు. కాగా, ప్రధాని మోదీ కొద్ది నెలల కిందట అమెరికా, రష్యా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించి, అంతర్జాతీయ సమాజంపైనా తనదైన ముద్రవేశారు.

  • Loading...

More Telugu News