: ఎన్టీఆర్ విగ్రహానికి మహిమలున్నాయి: చాగల్లు సభలో చంద్రబాబు


పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహానికి శక్తి ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మనసులో ఏదైనా తలచుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని తాకితే సంకల్పం నెరవేరుతుందని చెప్పారు. వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయి అవతారాలేమోగానీ ఎన్టీఆర్ మాత్రం అవతార పురుషుడేనని ఉద్ఘాటించారు. ఆయన చరిత్రను ఆయనే తిరగరాయాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒక్కసారి చూసివెళితే ఏ పనైనా జయప్రదం అవుతుందని తెలిపారు. ఆయన విగ్రహానికి మహిమలున్నాయని, తిరుమల శ్రీవారికి మొక్కుకుంటే ఎలా కష్టాలు తీరతాయో, ఎన్టీఆర్ విగ్రహానికి కూడా మొక్కుకుంటే కోరికలు తీరతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News