: ముగిసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాలకు అధికారుల కేటాయింపులపై అభ్యంతరాలు తెలిపిన అఖిల భారత సర్వీసుల అధికారుల అంశాన్ని ఈ సమావేశంలో పరిశీలించారు. ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు. భేటీ అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ, మరోసారి కమిటీ సమావేశం ఉండకపోవచ్చు అని తెలిపారు. పరస్పర మార్పిడి, భార్యాభర్తల అంశాన్ని కమిటీకి వివరించామని చెప్పారు.