: మే 14న తెలంగాణలో ఎంసెట్
వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ విద్యామండలి ప్రకటించింది. మే 14న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. మే 19న లాసెట్, 21న ఈసెట్, 22న ఐసెట్, 25 నుంచి పీఈసెట్, జూన్ 6న ఎడ్ సెట్ నిర్వహిస్తామని విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. తెలంగాణలో సీట్లు కావాలంటే కచ్చితంగా తాము నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలిపారు. ఎంసెట్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఎవరి ఎంసెట్ వారే నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడింది.